సింగరేణి కార్మికుల హక్కులపై వర్క్‌షాప్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, కొత్త లేబర్ కోడ్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య పాల్గొన్నారు.



