AI.. వెనకాల ఈ-వేస్ట్ సునామీ!

AI కోసం ప్రపంచవ్యాప్తంగా వేల డేటా సెంటర్లు నిర్మిస్తుండటంతో ‘ఈ-వేస్ట్ సునామీ’ ముంచుకొస్తోందని BAN రిపోర్ట్ హెచ్చరించింది. డేటా సెంటర్లలోని సర్వర్లు, స్విచ్‌లు, కేబుల్స్‌ను 2 నుంచి 5 ఏళ్లకోసారి మార్చాల్సి ఉంటుంది. దీంతో 2030 నాటికి AI వల్ల ఏటా 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ రావొచ్చని అంచనా. ఇందులో లెడ్, మెర్క్యురీ, కాడ్మియం వంటి విషపదార్థాలుంటాయి. ప్రస్తుతం ప్రపంచ ఈ-వేస్ట్‌లో 20 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు.



