వారి భద్రత.. మనందరిది!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మహిళల భద్రత మనందరి బాధ్యత’పై ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. DSP వేణుగోపాలరావు మాట్లాడుతూ.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలను వివరించారు. సమస్యలను భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. CI బి.కోటేశ్వరరావు సూచనలు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ కె.శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.



