← Back to news

వాటిల్లో ఎస్సీలకు ఫస్ట్ చాన్స్..!

By Siddu· 1h ago· Bhirampalle, Kondurg, Ranga Reddy
వాటిల్లో ఎస్సీలకు ఫస్ట్ చాన్స్..!

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పర్వతపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ఆరోపణలు వచ్చాయి. అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కేవలం పార్టీ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆర్డీఓకు మనవి పత్రం ఇచ్చారు. తమ పేర్లు ఎల్1 జాబితాలో ఉన్నా మొదటి, రెండో జాబితాలో ఇళ్లు మంజూరు కాలేదని వారు చెప్పారు. గ్రామంలో ఎనిమిది ఇళ్లు కేటాయిస్తే ఓసీ 1, బీసీ 7, ఎస్సీలకు 0 ఇచ్చారని మండిపడ్డారు. ఎస్సీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

More in Local