ఖైరతాబాద్ బరిలో ప్రజా వెలుగు పార్టీ

ఖైరతాబాద్ ఉపఎన్నికపై వస్తున్న ప్రచారాలకు ప్రజా వెలుగు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఉపఎన్నికలో ప్రజా వెలుగు పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని తెలిపారు. పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఖైరతాబాద్ ప్రజలు తమను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఉపఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.



