FSI అంశంపై గ్రామాల వారీగా సమావేశాలు

గుంటూరు జిల్లా అమరావతిలో CRDA డీపీ విభాగం ఆధ్వర్యంలో FSI (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) అంశంపై శుక్రవారం నుంచి గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ కొన్ని గ్రామాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎఫ్ఎస్ఐపై తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తెలియజేయాలని అధికారులు గ్రామస్థులను ఆహ్వానిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి తదుపరి ప్రణాళికలో పరిగణనలోకి తీసుకునే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించనున్నారు.



