ఇన్నాళ్లకు దొరికిన విష్ణుమూర్తి విగ్రహం తల!

మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో 11వ శతాబ్దం నాటి విష్ణుమూర్తి విగ్రహానికి మిస్సింగ్ పార్ట్ దొరికింది. ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన విగ్రహం తలను భారత Archaeological Survey of India (ASI) స్టోర్లో గుర్తించారు. నిపుణులు చెక్ చేసిన తర్వాత దాన్ని మళ్లీ విగ్రహానికి అమర్చనున్నారు. ఈ విగ్రహం రీస్టోరేషన్ అంశం గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇప్పుడు తల దొరకడంతో విగ్రహాన్ని తిరిగి పూర్తి రూపంలోకి తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది.

