2 కోట్ల రూపాయిలతో డెవలప్‌మెంట్ పనులు

గుండిమెడ గ్రామంలో 2 కోట్ల రూపాయిలతో డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు TDP మండల మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ శంకుస్థాపన చేశారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కొత్తగా కడుతున్న డ్రైనేజీలతో వర్షాలకు మునిగిపోయే పొలాలకు సమస్య ఉండదన్నారు. ఇందులో భాగంగా గుండిమెడ–కేఎల్‌యూ రోడ్డుపై 16 లక్షల రూపాయిలతో కల్వర్టు, 14 డ్రైనేజీలు, 13 సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.




