తెలంగాణలో జ్వరాల జోరు

TG: తెలంగాణలో వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది జ్వరాల బారినపడ్డారు. ఈ లెక్కలు ప్రభుత్వ హాస్పిటళ్లలో నమోదైన వివరాల ఆధారంగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లలో ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి సంఖ్య కూడా కలిస్తే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే ఇతర కుటుంబ సభ్యులకు కూడా సోకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

