← Back to news

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

By Sharmila· 2h ago

TG: తెలంగాణలోని మంచిర్యాలలో ఈ రోజు ఉదయం వేగంగా వచ్చిన లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్‌లో రావడం ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

More in TG