నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి ఘన చరిత్ర

TG: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని మహా బౌద్ధ స్థూపం ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. 1970లలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో భారీ స్థూపంతో పాటు బౌద్ధ భిక్షువులు ఉండే గదులు, బావులు, ఇటుక కట్టడాలు బయటపడ్డాయి. బుద్ధుడి శిల్పాలు, కంచు విగ్రహం, పురాతన నాణేలు, సున్నపురాయితో చేసిన చిన్న స్థూపం లభించాయి. ప్రస్తుతం బయటపడిన <a href="https://www.theclearcutnews.com/n/gxxKbAQ">చారిత్రక వస్తువులను</a> భద్రపరచి, వాటి గురించి సందర్శకులకు వివరించేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

