30 మంది విద్యార్థినులకు అస్వస్థత

కడప జిల్లా తొండూరు గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. భోజనం చేసిన అనంతరం దాదాపు 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని తొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురుకులంలో హాస్టల్ నిర్వహణ సరిగా లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బాత్రూంలు, తాగునీరు, డైనింగ్ హాల్ వంటి కనీస సౌకర్యాలపై కూడా సమస్యలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



