బంగారం చూసినా మనసు మారలేదు

AP: బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ ఓ వివాహం నిమిత్తం తిరుమలకు వచ్చారు. వివాహ వేడుక అనంతరం తన ఫ్యామీలితో కలిసి తిరుపతిలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేశారు. రూ.45లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచి బెంగళూరుకు వెళ్లిపోయారు. బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గరుడాద్రి హోటల్ వద్దకు వెళ్లి విచారించగా క్యాషియర్ శశి హ్యాండ్ బ్యాగ్‌ను వారికి అప్పగించారు. వివాహానికి సంబంధించిన విలువైన నగలు దొరక్కపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లమని బాధితుడు తెలిపాడు.



