జ్యువెలరీ షాప్‌లో ఫేక్ బాబా మోసం
UPలోని ఝాన్సీలో ఓ ఫేక్ బాబా జ్యువెలరీ షాప్‌లో మోసం చేసి డబ్బులతో ఎస్కేప్ అయ్యాడు. భవిష్యత్ చెబుతానంటూ షాప్‌లోకి వెళ్లిన బాబా.. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఓ నోట్ల కట్ట తీసుకుని మంత్రాలు చదువుతూ.. దాన్ని షాప్ వ్యక్తికి తెలియకుండా దాచేశాడు. చివర్లో ఆశీర్వదిస్తానంటూ డబ్బులు నోట్లో పెట్టుకున్నట్టు నటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సీన్ <a href="https://x.com/MuslimVoiceCell/status/2103329069165400307">CCTVలో రికార్డైంది.</a> కంప్లైంట్‌తో పోలీసులు కేసు బుక్ చేసి బాబా కోసం వెతుకుతున్నారు.



