విద్యుత్ వైర్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లు దొంగిలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ తెలిపారు. కేసు వివరాలను వెల్లడిస్తూ 56 కేజీల సిల్వర్ సర్వీస్ వైర్, 5 కేజీల కాపర్ వైర్, రూ.5.40 లక్షల నగదు, ఒక ఆటో, రెండు బైక్‌లు, ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, మహేష్, కిరణ్, రంగనాయకులు అనే ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


