ప్రైవేట్ స్కూళ్లపై నిఘా ఎప్పుడు?

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 17 ప్రభుత్వ, 8 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులే లేవని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పష్టమైన చర్యలు లేవు. స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా? భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? రవాణా, పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనుమతులు, బస్సుల ఫిట్‌నెస్, విద్యార్థుల భద్రతపై సమగ్ర తనిఖీలు చేసి వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.


