← Back to news

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థికసాయం

By Sunke Vinith· 1d ago· Tallapet, Dandepally, Mancherial
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థికసాయం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ బొజ్జ గంగన్న కుటుంబాన్ని మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ పరామర్శించారు. కుటుంబసభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదువేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు ఈ సహాయం చేసినట్లు ఆకుల రాజేందర్ తెలిపారు. కష్టకాలంలో గంగన్న కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో సహాయం అందించినట్లు చెప్పారు.

More in Local