వయాగ్రాతో క్యాన్సర్‌కు చెక్!

పురుషుల్లో అంగస్తంభన సమస్యకు వాడే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) క్యాన్సర్ కణాల వ్యాప్తిని, కణితుల పెరుగుదలను అడ్డుకుంటున్నదని ‘వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వయాగ్రా 'క్యాన్సర్' వ్యాప్తిని నెమ్మదింపజేయటంలో సహాయపడుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి. శరీరంలో ఒక చోట క్యాన్సర్ మొదలయ్యాక..మిగతా అవయవాలకు చేరాలంటే కొలెస్ట్రాల్ కావాలి. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కీమోథెరపీ మందులతో పాటు వయాగ్రా వాడితే మరింత ప్రభావం కనపడిందని శాస్త్రవేత్తల బృందం తేల్చింది.



