పొట్ట కొవ్వును తగ్గించే కొత్త ఇంజెక్షన్?

అదిక బరువు తగ్గించేందుకు CBL-514 అనే కొత్త ఇంజెక్షన్‌పై రిసేర్చర్ డాక్టర్ W. Timothy Garvey చేసిన రీసెర్చ్ ఆశాజనక ఫలితాలను చూపించాయి. ఈ ఇంజెక్షన్ స్కిన్ కింద ఉండే కొవ్వుతో పాటు, పొట్టలో అవయవాల చుట్టూ పేరుకునే ప్రమాదకరమైన కొవ్వును కూడా తగ్గించవచ్చని వెల్లడైంది. ఈ పరిశోదనలో పాల్గొన్నవారిలో 8 వారాల తర్వాత కొవ్వు పరిమాణం తగ్గినట్లు గుర్తించారు. అయితే, ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. దీని భద్రత, దీర్ఘకాలిక ఫలితాలపై మరిన్ని అధ్యయనాలు అవసరమని తెలిపారు.



