మహిళల నొప్పిపై గ్లోబల్ స్టడీ..

<a href="https://www.nature.com/articles/s41591-026-04696-w">‘GRRC-P</a>’ పేరుతో జరిగిన గ్లోబల్ స్టడీలో మహిళలు, పురుషులతో పోలిస్తే ఎక్కువ నొప్పిని అనుభవిస్తున్నట్లు తేలింది. 118 దేశాలకు చెందిన 61 లక్షల మందికి పైగా వివరాలను పరిశీలించి ఈ పరిశోధనను ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురించారు. తల, ముఖం, మెడ, వీపు, ఛాతీ, కడుపు, తుంటి, మోకాళ్లు సహా 11 శరీర భాగాల్లోనూ మహిళలు ఎక్కువ నొప్పి ఉన్నట్లు తెలిపారు. కేవలం పెయిన్‌కిల్లర్స్ ఇవ్వడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు.



