వరంగల్‌లో HYDRA తరహా ఆపరేషన్ (Video)
TG: వరంగల్‌లోని భద్రకాళి టెంపుల్ దగ్గర చెరబండ రాజు కాలనీలో పేదల ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు ఇళ్లు కూల్చుతుండగా.. కాలనీవాసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్లు కూల్చివేస్తుండటంతో కొందరు పేదలు కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళన చేసిన వారిని పోలీసులు మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా కాలనీవాసులు నిరసన చేశారు.

