పెళ్లిళ్లు నిలవాలంటే భర్తలు హోమ్‌మేకర్స్ అవ్వాల్సిందేనా?!

హౌస్ హస్బెండ్స్ కాన్సెప్ట్ సొసైటీలో న్యూ నార్మల్‌గా మారాలని మద్రాస్ హైకోర్టు కామెంట్స్ చేసింది. హోమ్‌మేకర్ అనేది ఏ ఒక్క జెండర్‌కో పరిమితం కాదని, హౌస్ వైఫ్‌తో పాటు హౌస్ హస్బెండ్‌కి కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రెజెంట్ ఉమెన్స్ కెరీర్ ఓరియంటెడ్‌గా మారుతున్నారని, మ్యారేజ్ సిస్టమ్‌ని సేవ్ చేయాలంటే భర్తలు కూడా హోమ్‌మేకర్స్‌గా ఉండటానికి ముందుకు రావాలని కోర్టు అభిప్రాయపడింది. ఇల్లు చూసుకోవడం ఎకనామిక్ వాల్యూ ఉన్న వర్కేనని తెలిపింది.


