నదిలో పడి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ మృతి

TG : హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ 27 ఏళ్ల పడాల కల్యాణ్‌కుమార్ జనగామ జిల్లా మల్లన్నగండి నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఫ్రెండ్స్, బంధువులతో కలిసి వరంగల్ భద్రకాళి గుడికి వచ్చిన ఆయన, తిరుగు ప్రయాణంలో నది చూడటానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. ఇవాళ ఉదయం ఆయన మృతదేహం నీటిపై తేలింది. పోలీసులు కేసు ఫైల్ చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.

