పేదల సొంతింటి కల నెరవేర్చాలి : సీపీఐ
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇళ్ల స్థలాలు లేని వారితో సీపీఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదస్సుకు సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, అన్నవరం ప్రభాకర్‌తో పాటు పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.


