అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసుల దాడి..!

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలింపూర్ శివారులో అక్రమ మట్టి రవాణా జరుగుతోంది. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు దాడి చేశారు. ఒక హిటాచీ, నాలుగు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. CI శ్రీశైలం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా, గుట్ట విచక్షణ, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మంచి బచ్చన్నపేట – మంచి సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



