← Back to news

కడుపునొప్పితో దంపతుల మృతి.. కలకలం

By Bala· 1d ago· TG
కడుపునొప్పితో దంపతుల మృతి.. కలకలం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్‌ (28), అతడి భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో మృతి చెందారు. వకీల్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటున్న ఈ దంపతులు సోమవారం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అజయ్‌ మృతి చెందగా, చికిత్స పొందుతూ దినేశ్వరి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Politics