← Back to news

శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీలోని MTMC హైస్కూల్ వద్ద శ్రీగాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా భవాని భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజైన సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిరోజూ సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.

More in Local