AP పోలీస్ జాబ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్

AP: స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు - SLPRB.. సెప్టెంబర్ 16న పోలీసు, ఫైర్, ఫోరెన్సిక్, జైళ్లు విభాగాల్లో మొత్తం 2050 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో సివిల్, రిజర్వ్, కమ్యూనికేషన్, పీటీఓ, ఎస్‌పీఎఫ్ వంటి 438 ఎస్సై పోస్టులు.. 1356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఫైర్‌మెన్, జైల్ వార్డర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లై, ఎగ్జామ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని SLPRB తెలిపింది. అఫీషియల్ వెబ్‌సైట్ slprb.ap.gov.inలో వివరాలు చూడవచ్చు.


