తట్టుపల్లిలో కొత్త విద్యుత్ స్తంభాలు!

మహబూబాబాద్ట్టు జిల్లా తట్టుపల్లిలో విద్యుత్ స్తంభాల పనులు స్టార్ట్. కురవి మండలం తట్టుపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల దగ్గర కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. విద్యుత్ సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలా మంగీలాల్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త యాకన్న, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



