డాక్యుమెంట్లు అడిగితే బైకుకు నిప్పు!
TG: హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు తన బైకుకు నిప్పంటించాడు. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ టైంలో డాక్యుమెంట్లు చూపించాలని S.I కోరగా, యువకుడు వాగ్వాదానికి దిగి పెట్రోల్ పోసి బైకును తగలబెట్టాడు. స్థానికులు, పోలీసులు మంటలను అదుపు చేయడంతో బైకు కొంతవరకు కాలిపోయింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు BNS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



