సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్ అన్నారు. సత్తుపల్లి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులతో పాటు ఇతర రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కారానికి తీసుకురావాలని తెలిపారు.



