వార్డు మెంబర్లకు శిక్షణ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కొత్తగా గెలిచిన పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన 5 రోజుల శిక్షణ ఇవాళ ముగిసింది. MPDO ఆఫీస్‌లో జరిగిన ఈ ట్రైనింగ్‌లో ఊరి పరిపాలన, వార్డు మెంబర్ల బాధ్యతలు, గ్రామాభివృద్ధి పనులు, స్కీమ్‌ల అమలుపై ఆఫీసర్లు అవగాహన కల్పించారు. MPDO ప్రవీణ్, పంచాయతీ అధికారులు పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.




