సింగరేణి కార్మికులే రియల్ హీరోలు: KTR

TG: సింగరేణి కార్మికులు దేశానికి వెలుగులు అందించే హీరోలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో ఆయన మాట్లాడారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. చెమట, రక్తం ధారపోసి దేశానికి కరెంటు అందిస్తున్న ప్రతి కార్మికుడికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ రామగుండం అంటూ.. కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.



