← Back to news

భవానీ మాలలతో చిన్నారుల భక్తి సందడి

By SK.Gani· 2h ago· East Godavari
భవానీ మాలలతో చిన్నారుల భక్తి సందడి

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. చిన్నారులు భవానీ మాలలు ధరించి అమ్మవారి నామస్మరణతో సందడి చేస్తున్నారు. ‘జై దుర్గ’ అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

More in Local