← Back to news

గ్లోబల్ స్టేజ్‌పై కీర్తి ‘డోరతీ’.. TIFFలో ప్రీమియర్!

By Mahesh· 1d ago

కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తమిళ మూవీ ‘డోరతీ’కి గ్లోబల్‌గా క్రేజ్ పెరుగుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించారు. థియేటర్లలోకి రాకముందే కెనడాలో జరిగిన ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లోని సెంటర్‌పీస్ విభాగంలో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శించారు. స్క్రీనింగ్‌కు కీర్తి సురేష్‌తో పాటు మూవీ టీమ్ హాజరైంది. సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ నెల 25న మూవీ రిలీజ్ కానుంది.

More in Entertainment