SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!

బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ SIRపై కీలక కామెంట్స్ చేశారు. SIR ఉద్దేశంపై మొదటి నుంచే సివిల్ సొసైటీ, ప్రజలు అలర్ట్ చేశారని అన్నారు. కర్ణాటకలో వెంటనే ఎన్నికలు లేవని, ఓటర్ల లిస్ట్‌ను సరిగ్గా చెక్ చేసేందుకు టైమ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. <a href="https://x.com/ians_india/status/2098677475387584978">ఇది T20 మ్యాచ్ కాదని,</a> SIR విషయంలో తొందర అవసరం లేదన్నారు. BLOల కొరతతో తప్పులు జరిగే ఛాన్స్ ఉందని, అధికారులపై ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. ఐదు కోట్లకు పైగా ఓటర్లను నెల రోజుల్లో వెరిఫై చేయడం అంత ఈజీ కాదన్నారు.


