← Back to news

9 ఏళ్లు దాచింది… చివరికి తన పేరుపై స్థలం!

By siddu vinay· 1d ago

ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీక్షా జైస్వాల్ 2017లో తన అక్క పెళ్లయ్యాక, ఆమె ఎదుర్కొన్న కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలను గమనించింది. “అమ్మాయికి సొంత ఇల్లు అంటూ ఏదీ ఉండదా? ముందు తల్లిదండ్రులది, తర్వాత భర్తది…” అనే ఆలోచన ఆమెను వెంటాడింది. అప్పుడే తనకంటూ ఓ స్థలం ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి సంపాదించిన డబ్బుతో గల్లా బుడ్డిలో నాణేలు, బంగారం దాచుకుంటూ వచ్చింది. అలా 9 ఏళ్ల తర్వాత, 29 ఏళ్ల వయసులో తన పేరుపై స్థలం కొనుక్కుంది. ఈ మొత్తం కథను దీక్షా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

More in Personal Finance