IIT హైదరాబాద్‌లో AIపై కొత్త కోర్సు 🤖

AI అప్లికేషన్లు తయారు చేయడం నేర్చుకోవాలనుకునే ఉద్యోగుల కోసం IIT హైదరాబాద్ కొత్త AI సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ 4 వారాల కోర్సులో, కేవలం AI గురించి తెలుసుకోవడం కాకుండా నిజ జీవిత పనులకు ఉపయోగపడే AI సాధనాలను సొంతంగా తయారు చేయడం, వాటి పనితీరును పరీక్షించడం, సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం నేర్పిస్తారు. కోర్సు హైబ్రిడ్ విధానంలో ఉంటుంది. శనివారం తరగతులకు క్యాంపస్‌కు వెళ్లొచ్చు లేదా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాల్గొనొచ్చు.
