ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

TG: హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ ఏ.అప్పయ్య తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, జిల్లా మేనేజర్ విక్రమ్, మున్సిపల్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి రోహిణి, ఏకశిలా ఆసుపత్రులను సంయుక్తంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించిన ఫీజుల బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో రోహిణి, ఏకశిలా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నిబంధనలను ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ అప్పయ్య సూచించారు.