← Back to news

కొత్తపేటలో హిందూ సమ్మేళనం

By mpkr· 2h ago· Ananthapuramu
కొత్తపేటలో హిందూ సమ్మేళనం

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు చెందిన ఛత్రపతి శివాజీ అధ్యక్షుడు బైలూరు యోగేష్ ప్రభు హాజరయ్యారు. స్థానిక ఆధ్యాత్మికవేత్తలు కూడా పాల్గొని ఆధ్యాత్మిక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలాంటి సమ్మేళనాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

More in Local