సంఘ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తా: కృష్ణ కుమార్

AP: పల్నాడు జిల్లా గురజాల మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఆచంట కృష్ణ కుమార్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు సంఘ సభ్యులు, బ్రాహ్మణ సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆచంట కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. సంఘ సభ్యుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు. బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొని నూతన అధ్యక్షుడిని అభినందించారు.