ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో బ్లాక్ మాస్క్, క్యాప్ ధరించి మొదటి వరుసలో కూర్చున్న మిస్టరీ వ్యక్తి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. ఆయన ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మోజ్తబానే ఆ మాస్క్ మ్యాన్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఫిబ్రవరి నాటి వైమానిక దాడుల్లో మహ్మద్ జవాద్ ముఖానికి తీవ్ర గాయాలు, కాలిన గాయాలు కావడంతోనే ఆయన ముఖం కనపడకుండా మాస్క్ ధరించినట్లు స్పష్టమైంది.

