పెనుమూలిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొత్త సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పేరంటాలమ్మ ఆలయం సమీపంలో చేపట్టనున్న రోడ్ల పనులకు అర్చకులు వేదమంత్రాలు చదువుతుండగా, కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.

