అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లారెడ్డిపల్లిలో బాట ఏర్పాటు పేరుతో తమకు సమాచారం ఇవ్వకుండా వ్యవసాయ భూముల్లో గుంతలు తవ్వి నష్టం కలిగించారని రైతులు ఆరోపించారు. సర్వే నంబర్ 328లో 2002లో నాలుగు ఎకరాలకు డి.పట్టా పొందామని, భూమికి సంబంధించిన రికార్డులు ఉన్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.


