← Back to news

అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు హంపి విజ్ఞప్తి

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు హంపి విజ్ఞప్తి

అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి మంత్రి నారా లోకేష్‌ను కోరారు. ఇవాళ ఉండవల్లిలోని నివాసంలో తండ్రి అశోక్‌తో కలిసి మంత్రిని కలిశారు. చెస్ ఒలింపియాడ్‌ -2026లో మహిళల జట్టు కాంస్య పతకం సాధించడంతో పాటు, వ్యక్తిగత విభాగంలో హంపి కాంస్యం గెలవడంపై లోకేష్ అభినందించారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

More in Local