ACB చిక్కిన అంగన్వాడీ CDPO

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 63వేల లంచం తీసుకుంటున్న CDPO పద్మను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతినెల తనకు 1,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు అంగన్వాడీ టీచర్లు ACB అధికారులకు ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లిలోని 21 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి మూడు నెలల బకాయిగా మొత్తం 63వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు.



