ఢిల్లీ నిరసనల్లో పోలీసుల కొత్త అప్‌డేట్..

ఢిల్లీలో ఇండియా బ్లాక్ నేతల నిరసనకు పోలీసులు బాడీ కెమెరాలతో డ్యూటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ సందర్భంగా న్యూ ఢిల్లీ ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారు. ఇటీవల జరిగిన నిరసనల్లో కొందరు మహిళా జర్నలిస్టులు పోలీసులపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు చేశారు. దీంతో ఈ నిరసనలో పోలీసులు బాడీ కెమెరాలు ధరించి, అక్కడ జరిగే విషయాలను రికార్డ్ చేస్తున్నారు. ఈ ఫుటేజ్ వల్ల ఘటనలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
