సేలం చర్చిలో గందరగోళం.. పాస్టర్‌ను నిలదీసిన బాధితులు
తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అమ్మపేటలోని చర్చిలో గందరగోళంగా నెలకొంది. మదర్ థెరిసా ట్రస్ట్‌కు సంబంధించిన 3,000 కోట్ల రూపాయల ఆర్థిక మోసం బాధితులు, ఆ ట్రస్ట్‌తో సంబంధం ఉందని చెప్పుకునే పాస్టర్ సెంథిల్‌కుమార్‌ను నిలదీశారు. గతంలో పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేశారు. పాస్టర్ సెంథిల్‌కుమార్ బెయిల్‌పై రిలీజై చర్చికి రావడంతో బాధితులు నిలదీశారు. దీంతో అతను పారిపోయాడు. 14 రోజుల నుంచి బాధితులు చర్చి వద్దే నిరసన చేస్తున్నారు.



