← Back to news

జింకల వేట కేసులో ముగ్గురు అరెస్ట్

By Sharmila· 2h ago
జింకల వేట కేసులో ముగ్గురు అరెస్ట్

TG:హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో వాహన తనిఖీల సందర్భంగా జింక మాంసంతో వెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్‌గా గుర్తించారు. కర్ణాటకలోని కలబురగి అటవీలో జింకలను వేటాడినట్లు గుర్తించారు. వారి కారు నుంచి రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, బ్యాటరీ, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురూ కలిసి 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.

More in TG