పల్లె పండుగ-3.0 విజయానికి సమష్టి కృషి!

నెల్లూరు జిల్లాలోని రామాపురంలో ఈ నెల 29న పల్లె పండుగ-3.0 జరగనుంది. దీన్ని విజయవంతం చేయాలని MLA కాకర్ల సురేష్ అధికారులు, నాయకులకు సూచించారు. ఉదయగిరి MDO కార్యాలయంలో సమీక్ష జరిగింది. సభా ప్రాంగణం, పార్కింగ్, ప్రజల రాకపోకలు, భద్రతపై చర్చించారు. పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు, AP అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, షేక్ రియాజ్, మండల నాయకులు పాల్గొన్నారు.



